పోతుల సాయినాథ్ కు అభినందన సత్కారం

తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ గా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ గా పోతుల సాయినాథ్
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ములకలచెరువు మండలం మరియు పి.టి.ఎం మండలం జనసేన పార్టీ నాయకులు పోతుల సాయినాథ్ గారిని
గౌరవప్రదంగా కలసి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ములకలచెరువు మండల ఉపాధ్యక్షులు షోరూమ్ సూరి, ప్రధాన కార్యదర్శులు బాబాజాన్, మహేష్, సంయుక్త కార్యదర్శులు నరేష్, ఆంజనేయులు, కోటప్ప అలాగే పి.టి.ఎం మండలం అధ్యక్షులు శంకర, ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, మండల సలహాదారులు నాగరాజు, సంయుక్త కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షుడు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ మరియు క్రియాశీలక కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.