పివిఎన్ మాధవ్‌కు శుభాకాంక్షలు

విజయవాడ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, జనసేన పార్టీ కడప అసెంబ్లీ ఇంచార్జ్ మరియు ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ విజయవాడలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేస్తూ, తన తరఫున మరియు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పివిఎన్ మాధవ్ నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతమై, రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి సమిష్టిగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this content:

Post Comment