ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు

కైకలూరు, శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికి జనసేన లీగల్ సెల్ ప్రతినిధి, కైకలూరు నియోజకవర్గ జనసేన లీగల్ సెల్ ప్రతినిధి, ప్రముఖ యువ న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త రవితేజ తణుకుల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “విద్యార్థుల కృషి, పట్టుదల, నమ్మకమే ఈ విజయానికి మూలం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్యారంగం మరింత అభివృద్ధి చెంది, విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను” అని రవితేజ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఫలితాల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన విద్యార్థులకు కూడా ధైర్యం చెప్పారు. “విజయం, ఓటములు జీవన ప్రయాణంలో భాగం మాత్రమే. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమేనేగాని, జీవితం మొత్తాన్ని నిర్దేశించదు. మనోధైర్యంతో, మెరుగైన ప్రణాళికతో రాబోయే సప్లిమెంటరీ పరీక్షలను ఎదుర్కొనాలి” అని సూచించారు. తన విద్యా ప్రయాణంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని పంచుకుంటూ, “అవకాశాలను గుర్తించి, వాటిని వినియోగించుకున్నప్పుడు మాత్రమే విజయవంతం అవుతాం. ఓటముల నుంచి నేర్చుకొని, మరింత బలంగా తిరిగి రావాలి” అని విద్యార్థులకు ప్రేరణ నిచ్చారు.

Share this content:

Post Comment