రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళాకారులకు అభినందన సత్కారం

  • కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ

తాడేపల్లిగూడెం: రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 132వ నెలవారీ కార్యక్రమం మరియు ఈ సంఘం ద్వారా ఈ కార్యక్రమంలో పేద కళాకారులకు చేసే ఆర్థిక సహాయం కార్యక్రమం స్థానిక గీత మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ విచ్చేశారు. ప్రతినెలా కళాకారుల సంక్షేమ సంఘం వారు సమాజ సేవ చేసేవారిని ప్రోత్యహించే గౌరవ సత్కార గ్రహీత పురస్కారం, నియోజక వర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన జిల్లా కార్యదర్శి కేశవ బట్ల విజయ్ ని సత్కారించారు. మరియు ఉత్తమ ఉద్యోగ పురస్కార గ్రహితగా షేక్ హజరత్ వలీ నీ, మరియు కోపల్లే శ్రీనివాస్ ను కళా సత్కార గ్రహితగా సత్కరించారు. పేద కళాకారిణి శ్రీమతి బోయిన గంగాజలం కు కళా పోషకులు మరియు కళా అభిమానులు సహకారంతో 25000 రూపాయలు అందచేశారు. ఈ సమావేశంలో కాశీ మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ సంఘం కోసం మరియు బీసీల హక్కుల కోసం జరిగే పోరాటంలో ముందు ఉండే విజయ్ గారినీ సత్కరించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. వక్తలు మరియు గౌరవ సత్కార గ్రహీతలు మాట్లాడుతూ తమ వంతు సహాయం కళాకారులకు కచ్ఛితంగా అందజేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ యువజన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అత్తిలి బాబి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపధ్యక్షులు మారిసెట్టి నరసింహ మూర్తి, నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న పట్టణ యువజన అద్యక్షులు సుధీర్, నియోజక వర్గ కార్యదర్శి లక్ష్మణరావు, బీసీ నాయకులు పవన్, రామకృష్ణ, కుమార్, వెంకట్, ప్రకాష్ మరియు కళా అభిమానులు పాల్గొన్నారు.