కాంగ్రెస్ మేనిఫెస్టో.. వరద బాధితులకు రూ.50 వేలు

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు ఠాగూర్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క విడుదల చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ పొడిగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని వెల్లడించింది. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ లేకుండా చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దు, ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.