పాలకొండ నియోజకవర్గం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వివిధ పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ తరపున ప్రచారం చేసిన ఆయన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మీ గొంతుకగా పనిచేసే వ్యక్తి అయిన రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని కోరారు అనంతరం కూటమి కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ప్రజాసమస్యలపై మాట్లాడాలంటే ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం మాట్లాడటం వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సబబు కాదు అని నిమ్మక జయకృష్ణ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన జగన్ మెహన్ రెడ్డి 15 నిముషాలు కూడా అసెంబ్లీలో ఉండకపోవడం దారుణమని అన్నారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం అవుతుండగా ప్రతిపక్ష హోదాకోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోడియం వద్దకు రావడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని, నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ అధినేత జగన్ కు హితవు పలికారు.
Share this content:
Post Comment