తుని జనసేన ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

తుని, భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా తుని నియోజకవర్గ జనసైనికులు జనసేనశివ మరియు ఇండుగుబిల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ మరియు 200 మందికి భోజనాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, తొండంగి మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, తుని మండల అధ్యక్షులు ధారకొండ రమణ, సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్ , అంకంరెడ్డి రాజాశేషు, తేనే నాగశేషు, బాలాజీ, సీతారామరాజు, తొండంగి మండల ప్రధాన కార్యదర్శి గట్టెం నాగబాబు, తొండంగి మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్, కోటనందూరు మండల వైస్ ప్రెసిడెంట్ జనసేన రామ్, తుని మండల ప్రధాన కార్యదర్శి ప్రసన్న చోడిశెట్టి భాస్కర్, గెడ్డమూరి సురేష్, ఆనంద్, ఇళ్ళ శివన్నారాయణ, కోరుకొండ శివ, మీలా కొండబాబు, ఉగ్గిన లక్ష్మణ్, ఉదయ్ మరియు జనసైనికులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.