నిబంధనలకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరగట్లేదు

ఏలూరు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 404 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 25 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి 2019 అక్టోబర్ 4న అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా మెడికల్ కాలేజ్ సిబ్బందికి, టీచింగ్ స్టాఫ్ కు రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి. వీటితో పాటు మెడికల్ కళాశాలకు 38 కోట్ల రూపాయలతో రెండు భవనాలు, టీచింగ్, నాన్ టీచింగ్, భవనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 23 నాటికి మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి చేసి, మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ఎంబిబిఎస్ అడ్మిషన్లు ప్రారంభించడానికి భవన నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎంబిబిఎస్ కోర్స్ చదివే విద్యార్థులు నిరాశకు గురయ్యారు. మెడికల్ కళాశాల భవనాలు, ఆసుపత్రికి ల్యాబ్ లు, సిబ్బంది, అనుబంధ భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో, మెడికల్ కళాశాల తనిఖీకి వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీం ఇక్కడ జరుగుతున్న పనుల తీరు, అనుబంధ భవనాల నిర్మాణాల తీరు, శాశ్వత భవనాలు పూర్తి కాకపోవడంతో మెడికల్ కాలేజీకి అనుమతులకు ఇవ్వకుండా ఇదేం భవన నిర్మాణాలు అంటూ వెనుతిరిగింది. కానీ మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ మరో 30 నెలల్లో మెడికల్ కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేసి ఎంబిబిఎస్ కోర్సును మెడిసిన్ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారని, నిబంధనలకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరగట్లేదని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు.