బర్రింకలపాడు గ్రామంలో పశువుల త్రాగునీటి తోట్ల నిర్మాణం ప్రారంభం

ఏలూరు జిల్లా, జిలుగుమిల్లి మండలం పరిధిలోని బర్రింకలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల త్రాగునీటి తోట్ల నిర్మాణం కార్యక్రమం ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు విచ్చేసి, కొబ్బరికాయ కొట్టి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, అడపా నాగరాజు, మెట్ట బుచ్చిరాజు, వెటర్నరీ డాక్టర్లు, ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ టిఏ లు, సిబ్బంది, ఎన్.డి.ఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment