పార్వతీపురం నియోజకవర్గం, సమాజంలోని ప్రజలంతా బహిరంగ మలవిసర్జనను నియంత్రించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలంలోని బాలగొడబ గ్రామంలో ఆయన స్వర్ణాంధ్ర -స్వచ్చాంద్ర కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులుఎరిని బహిరంగ మలవిసర్జనకు వెళ్ళనీయకుండా వారి పిల్లలు బాధ్యత పడాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా కొనసాగే అవకాశం ఉందని, అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు విద్యార్థులే గృహ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఇలా చేస్తే ప్రజలకు డయారియా గాని మలేరియా గాని సోకకుండా ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. గృహాల్లోని తడి, పొడి చెత్తను వేరు చేసి ఇంటికి వస్తున్న పారిశుద్ధ కార్మికులకు అందజేసి చెత్త నుంచి సంపదను పొందేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ఆయన ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆగూరు శ్రీను, వంగపండు సంతోష్, వెంకట్, కె.మని, అధికారులు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment