పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన-తెలుగుదేశం పార్టీల సమన్వయ పోరాటం

పూతలపట్టు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాక్షస పాలనను అంతమొందించడానికి, తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలనే ఆకాంక్ష మేరకు, ఆదివారం పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం వేపనపల్లి పంచాయతీలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారి మనోహర్ ఆధ్వర్యంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని, ఉమ్మడి పోరులో ఒక అడుగు ముందుకు వేశారు. ఉచితాలు మాకు వద్దని మా పిల్లల భవిష్యత్తు కావాలని, నిరుద్యోగం నిర్మూలించి, యువతకు తగు ఉద్యోగాలు కల్పించాలని ప్రజలు కోరారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తూ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎలా పని చేయాలో ప్రజలే నిర్ణయించే విధంగా పార్టీ అధినాయకులు వ్యూహరచన చేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ తెలియజేశారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ, వారి అభ్యున్నతకు పాటుపడే విధంగా ప్రణాళికలు ఉంటాయని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కలికిరి మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుమార్, రాజశేఖర్, దొరబాబు, నాయకులు చింటు, చంద్రమౌళి, ప్రభాకర్, హేమాద్రి, ఉదయ్, పూర్ణ చంద్ర, చంటి, మౌని, త్యాగరాజులు, కిషోర్, వినీత్, మనోజ్, సందీప్, భాను, భార్గవ్, పూర్ణ, చంద్ర మరియు నాయకులు పాల్గొన్నారు.