కందులు మరియు శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం నందు ఎ.పి.మార్కెఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై కందులు మరియు శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ కనీస మద్దతు ధరపై కందులు మరియు శనగలు కొనుగోలులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే తర్లుపాడు సహకార సొసైటీ జనసేనకు కేటాయించడం పై మార్కాపురం నియోజకవర్గ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు భాషాపతి రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు వెలుగొండా రెడ్డి, కందుల రోహిత్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జనసేన తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జనసేన నాయకులు విజయరావు నరసింహారావు, గుంటు రత్నకుమార్, వెలుగు కాశీరావు, సూరే సువర్ణ, మహేష్, సునీల్, టిడిపి తర్లుపాడు గ్రామ అధ్యక్షులు సుబ్బయ్య, ఈర్ల వెంకటయ్య, మేకల వెంకట్, కాలంగి శ్రీను, గోసు వెంకటేశ్వర్లు, మండల అగ్రికల్చర్ అధికారులు, సహకార సొసైటీ కార్యదర్శి వారి సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment