ఏపీ పాఠశాలల్లో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమైన విషయంతెలిసిందే.  ఈ క్రమంలోనే  విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరవుతున్నారు.. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు పాఠశాలలకి వస్తున్నారు.. స్కూళ్లలో జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది. జిల్లాల్లో టీచర్లు మరియు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తున్నాయి ..

తాజాగా తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని గంగుల కుర్రు అగ్రహరం ప్రభుత్వం పాఠశాలలో కరోనా విజృంభణ మొదలైంది. ఏకంగా పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఆ పాఠశాలలో 117 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..పది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఆ విద్యార్థులను ఇంటికి పంపించేసింది పాఠశాల యాజమాన్యం. విద్యార్థులనే కాదు…టీచర్లను వణికిస్తోంది ఈ మహమ్మారి కరోనా. తాజాగా చిత్తూరు జిల్లా ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 120 మంది టీచర్లకు కరోనా సోకగా..నలుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఏపీలో నవంబర్‌ 2న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే…ప్రారంభమైన మొదటి రోజే నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం రేపింది.

ఆ జిల్లాలోని మర్రిపాడు మండలంలోని నందవరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నలుగురికి కరోనా సోకింది. అంతేకాదు..మోడల్‌ స్కూల్‌ వాచ్‌ మెన్‌కు అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఏపీలో ఇలా కేసులు విజృంభిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.