ఏపీ స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కలకలం..

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుండడంతో భయం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లలను పంపించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా తెలంగాణలో బడులు ముతపడ్డాయి. ఏపీలో కూడా కరోనా విజృంభించడంతో స్కూల్స్ మూసివేయాని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం స్కూళ్లు మూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. కరోనా విజృంభణ నేపథ్యంల ఏప్రిల్ 1నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని నిర్ణయించింది. మే 14 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలు పనిచేసేలా షెడ్యూల్‌ విడుదల చేసింది. అలాగే మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి కానుండగా, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌లోడింగ్‌, ప్రమోషన్‌ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. కాగా, ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవని ప్రకటించింది.