బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ డ్ లో మరో నటుడు కరోనా బారినపడ్డాడు. యువ హీరోల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్ కు కరోనా సోకింది. రణబీర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని అతని తల్లి నీతూ కపూర్ వెల్లడించారు. తన కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని, క్రమంగా కోలుకుంటున్నాడని వివరించారు. ‘రణబీర్ ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతున్న అందరికీ కృతజ్ఞతలు’ అంటూ నీతూ సోషల్ మీడియాలో స్పందించారు.

రణబీర్ ఇంటి వద్దే క్వారంటైన్ లో ఉంటున్నాడని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆమె తెలిపారు. కాగా, నీతూ ప్రకటన కంటే ముందు కపూర్ కుటుంబీకులు రణబీర్ అనారోగ్యం పాలైనట్టు వెల్లడించినా, ఎందువల్ల అనారోగ్యం అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రణబీర్ తల్లి నీతూ వివరణ ఇచ్చారు.