ధూళిపాళ్ల కు కరోనా పాజిటివ్.. ఆయుష్‌ ఆస్పత్రికి తరలింపు

విజయవాడ: సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో అరెస్టయిన తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరం జైలులో ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు నరేంద్రకు చికిత్స కొనసాగిస్తున్నారు.