ఆమిర్ ఖాన్ కు కరోనా.. హోమ్ ఐసోలేషన్!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. కరోనా నిబంధనలను అనుసరించి ఇంట్లో ఐసోలేట్ అయినట్టు ఆయన ప్రకటించారు. ఈ మధ్య కాలంలో తనను కలిసినవారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమిర్ ఖాన్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘ఆమిర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో ఆయన ఐసోలేట్ అయ్యారు. కరోనా నిబంధనలను పాటిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’’ అని ప్రకటించారు. ఆమిర్ ఖాన్ తో కియారా అద్వానీ ఓ ప్రకటన కోసం ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆమెకు టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పాయి.

అయితే, ఆమిర్ ఖాన్ కన్నా ముందే ఆమెకు టెస్ట్ చేశారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా, కియారా హీరోయిన్ గా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ప్రస్తుతం భూల్ భులయ్యా 2 సినిమా తెరకెక్కుతోంది. కార్తీక్ కు కరోనా పాజిటివ్ రావడంతో అనీస్, కియారాలు టెస్ట్ చేయించుకున్నారు. కాగా, అంతకుముందు రణ్ బీర్ కపూర్, మనోజ్ బాజ్ పేయి, సిద్ధాంత్ చతుర్వేది, తారా సుతారియా, సతీశ్ కౌశిక్ లకూ కరోనా పాజిటివ్ వచ్చింది.