కార్పొరేషన్‌ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్ అలీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల వాయిదా వేయాలంటూ ఆయన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది.