ప్రజాసమస్యల పరిష్కారంలో కార్పొరేటర్ చొరవ..!

గుంటూరు తూర్పు నియోజకవర్గం 13వ వార్డులో శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఎదురుగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న సిమెంట్ దిమ్మెను మరియు శ్రీ గొల్ల ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన మెయిన్ లైన్ వాటర్ పైప్ లీకేజీ జరుగుతుంది. ఆ సమస్యను ఏ.ఈ దృష్టికి స్థానిక కార్పొరేటర్ సంకురి శ్రీనివాస్ జి.ఎం.సి వారికి తెలియజేయడం, వారు వెంటనే స్పందించి పైప్ లీకేజీ పనులు మరియు సిమెంట్ దిమ్మెను తీసివేయడం జరిగినది. స్థానిక ప్రజలు స్థానిక కార్పొరేటర్ సంకురి శ్రీనివాస్ మరియు బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మణ్ టిడిపి13వ వార్డ్ ప్రెసిడెంట్ చిన్న బుజ్జి మరియు ఎన్.డి.ఏ కూటమి నాయకులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Share this content:

Post Comment