తుప్పు పట్టి పోతున్న ప్రజాధనం

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బిట్టు-3 సమగ్ర గ్రామీణ మంచినీటి సరఫరా పథకం కింద 9 కోట్ల రూపాయలతో 2006 నిర్మితమై శిధిలావస్థలో ఉన్న వాటర్ ప్లాంట్ ని సందర్శించి విలేకర్లతో మాట్లాడటం జరిగింది. ఈ పరిశ్రమ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రజలకి స్వచ్ఛమైన శుద్ధి చేయబడిన తాగునీరు అందించడం అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తీసుకొని శుద్ధిచేసి 2 మండలాలు వెంకటాచలం మండలం ముత్తుకూరు మండలాలకు తాగునీరు అందించడం కోసం మొదటి విడత 4 కోట్లు. రెండో విడత 5 కోట్ల రూపాయలతో అప్పటి సర్వేపల్లి శాసనసభ్యులు తల్లి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 2006 లో నిర్మించడం జరిగింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మరి ఆయన చేసిన నిర్వాహకం తాగునీరు అందించే పరిశ్రమ శిధిలావస్థలో ఉంటే కనీసం అక్కడికి వెళ్లి దానిని పరిశీలించిన పరిస్థితులు కూడా ఇప్పటివరకు లేవు సమగ్ర గ్రామీణ తాగునీరు అభివృద్ధి పథకం కింద 9 కోట్ల రూపాయల ప్రజాధనం తుప్పుపట్టి పోతుంటే ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులు ఎవరూ కూడా పట్టించుకోలేదు ఈ విషయమై మేము ప్రభుత్వానికి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం దయచేసి మీరు వెంటనే పరిశీలించి పూర్తిస్థాయిలో ప్రజలకి మంచి నీరు అందించే దానికి అందుబాటులోకి తీసుకురావాలి అలా జరగని పక్షంలో రిలే నిరాహారదీక్ష చేయడానికైనా జనసేన పార్టీ మేము సిద్ధం ప్రజల పక్షాన ప్రజల కోసం జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రహీం భాయ్, సందీప్, శ్రీహరి, కాకి శివ, అస్తోటి రవి, రాకేష్, హేమంత్, వంశీ, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.