నాగుల చవితి ప్రత్యేక పూజల్లో కౌన్సిలర్ విజయలక్ష్మి దంపతులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పురపాలక సంఘ 9వవార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి, వాసు దంపతులు కుటుంబ సభ్యులతో శనివారం నాగుల చవితి పర్వదిన సందర్బంగా నల్లా గార్డెన్స్ రామకృష్ణ నగర్ జానకి పేట మధ్యలో గల పుట్ట వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టను దర్శించి పుట్టలో పాముకు పాలు పొయడం, గుడ్లు, తేగలు, బుర్ర గుంజు, చలివిడి, నువ్వులు పప్పులతో చేసే ప్రసాదంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి, గొలకొటి వాసు, గొలకోటి జగదీశ్వరి, మోటూరి సాయిదేవి, నల్లా సంతోషి తదితరులు పాల్గొన్నారు.