కొత్త పింఛన్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ విజయలక్ష్మి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పురపాలక సంఘ పరిధిలో 550 సామాజిక భద్రత కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి.9వ వార్డులో 9 పింఛన్లు మంజూరు కాగా వాలంటీర్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఒక్కరికి రూపాయలు 2750/- వంతున పంపిణీ చేసినట్టు వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి వాసు తెలిపారు.