బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయండి: విజయసాయికి సీబీఐ కోర్టు ఆదేశాలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి కోర్టు షరతులను ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఆరోపించారు. సాక్షులను భయాందోళనలకు గురిచేస్తున్నారని వెల్లడించారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10న ఉంటుందని కోర్టు పేర్కొంది.