నేరెడ్‌మెట్ డివిజన్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వాయిదా పడిన నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేరెడ్‌మెట్ డివిజన్ మొత్తంలో 25,176 ఓట్లు పోలవ్వగా 24,632 ఓట్లు లెక్కించారు. ఇప్పటి వరకు లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెలువడనుంది.