క్రాక్ సెన్సార్ టాక్: సంక్రాంతి బరిలో అసలైన బొమ్మ

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. కిక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈసారి తన క్రాక్ ఏంటన్నది చూపించడానికి వస్తున్నాడు. ఆల్రెడీ గోపీచంద్ తో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకోగా థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగకు ముందే అంటే జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అమాంతం అంచనాలు పెంచగా..ఇక ఇప్పుడు సెన్సార్ టాక్ అభిమానులను ఖుషి చేస్తుంది. శనివారం సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా చాల బాగా వచ్చిందని..మాస్ రాజా ఈ సినిమా తో అసలైన కిక్ ఇవ్వబోతున్నాడని, సంక్రాంతి బరిలో అసలైన బొమ్మ ఇదే అని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో రవితేజ పోలీసు పాత్రలో నటించనుండగా ఆయన సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.