జీవనోపాధి కోల్పోయిన రైతులకు రుణ సదుపాయం అందిచాలి: కిల్లో రాజన్

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో భారీగా పంట నష్టం జరిగింది. గిరిజనలు కొద్దో గొప్ప పండించేటటువంటి పంటలు ధాన్యం, బీన్స్, రాగి, సామలు, మినుములు, మొదలగు అనేక పంటలు, పాడైపోయాయి పంట నష్టపోయిన రైతులు పంట చేతికి వచ్చే సమయానికి చేజారిపోవడంతో లబోదిబోమని బాధపడుతున్నారు. ప్రధానంగా రాబడి వచ్చే చిక్కుళ్ళు నేలపాలు అయిపోవడంతో జీవనోపాధిని కూడా కోల్పోయారు. జీవనోపాధి కోల్పోయిన రైతులకు రుణ సదుపాయం అందిచాలి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎటువంటి రుణసదుపాయంలేదు, అందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో తుపాను వచ్చి ఇంకా తమ బతుకులను చిత్రవధ చేసిందని వాపోయారు. తక్షణమే సమగ్ర విచారణ చేసి పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం గవర్నమెంట్ అందించాలని జనసేన పార్టీ తరఫున పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్లు అన్ని గ్రామాలను సర్వే చేసి రైతుకి ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు అయితే నష్టపోయారో అన్ని ఎకరాలకు తక్షణ సహాయం కింద ప్రభుత్వం మంజూరు చేయాలని తక్షణమే రైతును ఆదుకోవాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.