పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు: బూరగడ్డ శ్రీకాంత్

గుడివాడ నియోజకవర్గం: భోగి సందర్భంగా శనివారం జనసేన పార్టీ కార్యాలయం ముందు జనసేన ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి అలాగే రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రుల చిత్రపటాలను భోగిమంటలలో వేసి ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబడాలని, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని శ్రీకాంత్ అన్నారు. ఈ మంత్రలకు తమ శాఖ మీద పట్టు లేదని తమ శాఖ మీద చర్చించే పరిజ్ఞానం లేని ఆవివేకులని అన్నారు. మీరు ఇలాగే పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు అని శ్రీకాంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర్ రావు (జిల్లా కార్యదర్శి), ఇంటూరి గజేంద్ర (మండల అధ్యక్షుడు), మజ్జి శ్రీనివాసరావు, సాయన రాజేష్, సుంకర వెంకట్, వడ్డాది లక్ష్మి కాంత్, వెంకటరమణ, జనార్దన్ రావు, వెంకటేశ్వరరావు, జేమ్స్, తదితరులు పాల్గొన్నారు.