మాండూస్‌ తుపాను బాధిత రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి

  • మాండూస్‌ తుపాను బాధిత రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన కనపర్తి మనోజ్ కుమార్

కొండపి: మాండూస్‌ తుపాన్‌తో పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు పంట పరిహారం చెల్లించాలని, రైతుల అప్పులను ప్రభుత్వం మాఫీ చేయాలని జనసేన పార్టీ పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్‌ చేసారు. మాండుస్ తుఫానుతో భారీ వర్షాల కారణంగా రైతులు వేసిన వివిధ పంటలకు నష్టం జరిగింది, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో మాండోస్ తుపాను కారణంగా శనగ, మిరప, పెసర, పొగాకు, మినుము, పత్తి, కూరగాయలు, పండ్ల తోటలు మొదలైన పంటలు భారీగా దెబ్బతిని రైతులు బాగా నష్టపోయారు. వేల ఎకరాల్లో పొన్నలూరు మండలంలో భారీ నష్టం జరిగింది. రైతులు ఈ నష్టం నుండి కోలుకోలేని స్థితిలో ఉండి ఆందోళనకు గురి అవుతున్నారు. వెంటనే నష్టపోయిన పంట నష్టం అంచనా వేసి, ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. పొన్నలూరు మండలంలో ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేంతవరకు జనసేన పార్టీ ఆ రైతులకు అండగా ఉంటుంది, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అండగా నిలవాలని కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు.