వన మహోత్సవానికి కోటి మొక్కలు

రాష్ట్రంలో ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో బాగంగా దాదాపు కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇందుకు మొత్తంగా 12,721 కి.మీ. పొడవునా రోడ్లకు ఇరువైపులా 70 లక్షల మొక్కలు, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న లేఅవుట్ల వద్ద మరో 30 లక్షల మొక్కలు సుమారు కోటి మొక్కల వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నాటాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, మొక్కలు నాటే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.