భారతదేశంలో ఏ పార్టీ నడవాలన్నా క్రౌడ్ ఫండింగ్ చాలా అవసరం: రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, స్థానిక జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాసేన కోసం నా వంతు అనే కార్యక్రమానికి (క్రౌడ్ ఫండింగ్) పార్టీ కార్యకలాపాలకు, పార్టీ నడవడికకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫండ్ ప్రజల నుండి విరాళం సేకరించాలని నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని అన్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా స్వామ్య వాదులు ఈ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ముందుకు నడవాలంటే స్వచ్ఛందంగా మన విరాళంతో నడిచే పార్టీని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఆంధ్ర రాష్ట్రం నిధుల్ని వినియిగించడానికి అవకాశం ఉంటుంది. కార్పోరేట్ సంస్థ వేల రూపాయల తీసుకుంటుంటే కేవలం కార్పోరేట్ సంస్థలకు మాత్రమే ప్రభుత్వం పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి భిన్నంగా నడవాలనేది జనసేన పార్టీ యొక్క కార్యాచరణ..దానిలో భాగంగానే ఈ క్రౌడ్ ఫండింగ్ పబ్లిక్ నుండి విరాళాలు సేకరించడం జరుగుతుంది అని అన్నారు. అటు అభిమానులు ఇటు కార్యకర్తలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 10 రూ నుండి తనకు శక్తి మేరకు తోచిన విధంగా ఎంతైనా పార్టీ యొక్క ఆర్ధిక మూలాలకు సహకరించాలని కోరారు. 2 వ విషయం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం ప్రక్కన రెండెకరాల స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయానికి స్థలాన్ని 2000 రూ లీజుకు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం.. ఎక్కడైనా రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి.. ప్రభుత్వం ఎంత అరాచకంగా ఎంత అనాలోచితంగా తమ పదవిని దుర్వినియోగం చేస్తుందో అర్థం అవుతుంది.. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈరోజున రాష్ట్రంలో ఏ పౌరుడు కూడా వారికి ఉన్న ఆందోళనలు ప్రభుత్వానికి వ్యక్తం చేసే అవకాశం లేకుండా అణచివేసి హౌస్ అరెస్టులు మొదలుకొని ఎక్కడికక్కడే ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఉపాధ్యాయుల్ని నిర్బంధిస్తున్నారు. వారిని హింసిస్తున్నారు. ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు మీద వారి నిరశనను తెలియజేశారు కదా ఇప్పుడు ఏమైంది అని సూటిగా ప్రశ్నించారు. ఏ ఉపాధ్యాయులైతే చదువులు నేర్పారో ఎవరైతే మనకు జ్ఞానాన్ని నేర్పించారో ఆ ఉపాధ్యాయుల్ని హింసించి వారిని చట్ట పరిధిలో తీసుకుని చులకనగా చూస్తున్నారు. వారి మీద కేసులు పెట్టె దారుణమైన పరిస్థితిని విరమించుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల మీటింగ్ లో ప్రస్తావించారు. ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన వాగ్దానాలను మరిచిన రోజున ఆ ప్రభుత్వం కానీ ఆ నాయకులు కానీ మరణించినట్లే అని అన్నారు. గుర్తు తెచ్చుకోండి ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టి అవమానపరిచారు. వారి హక్కులను మీరు హరిస్తుంటే భరించే పరిస్థితి లేదని, మీరు చేస్తున్న అరాచకాలకు సరైన సమయంలో మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు కందుకూరి ఈశ్వరరావు, ఆదిల్, వాసు తదితరులు పాల్గొన్నారు.