పట్టణంలో విచ్చలవిడిగా వేసిన ఫ్లెక్సీలను అరికట్టండి – పర్యావరణాన్ని పరిరక్షించండి

  • జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు

విజయనగరం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో ఫ్లెక్సీలను రద్దుచేస్తున్నామని ప్రకటించినా, ఆ మాటను లెక్కచేయకుండా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా అధికార పార్టీ ఫ్లెక్సీలను వేస్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని, ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఉదయం జిల్లా కలక్టర్ ఎ. సూర్యకుమారి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వినతిపత్రాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకుల ఆదాడ మోహనరావు సమర్పించారు. దీనికి జిల్లా కలక్టర్ సానుకూలంగా స్పందించి వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు), యువనాయకులు లోపింటి కళ్యాణ్, పత్రి సాయి, బంగార్రాజు పాల్గొన్నారు.