అమ్మా లవ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తల్లితో దిగిన క్యూట్ పిక్ షేర్ చేస్తూ.. అమ్మా లవ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే అని కామెంట్ పెట్టాడు. ఈ పిక్ మెగా అభిమానులనే కాక నెటిజన్స్‌ను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కొడుకు పుట్టినప్పుడు కాదు, వారు ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు సంతోషం. చిరంజీవి సోదరి, సాయి ధరమ్ తేజ్- వైష్ణవ్ తేజ్‌ల తల్లి లక్ష్మీ దుర్గా ఇద్దరు కుమారుల ప్రగతిని చూసి తెగ మురిసిపోతున్నారు. సాయితేజ్ ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకోగా, ఆయన సోదరుడు వైష్ఱవ్ తేజ్ ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తొలి సినిమాతోనే వైష్ణవ్ ఇలాంటి హిట్ కొట్టడాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. కుమారుల ఎదుగుదలని చూసి లక్ష్మీ దుర్గా హర్షం వ్యక్తం చేస్తున్నారు.