ఏ.ఎస్.డబ్ల్యు.ఏ ఆధ్వర్యంలో మహిళా రక్షణ, సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్ మొదలైన అంశాల మీద శివకోటి తెలగ కళ్యాణ మండపంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి కొత్తపేట డి.ఎస్.పి సుంకర మోహన్ మురళి, ట్రైని డి.ఎస్.పి సుదీప్తి, రాజోలు సి.ఐ టి నరేష్ కుమార్, రాజోలు ఎస్సై బి రాజేష్ కుమార్, మలికిపురం ఎస్సై సురేష్ పాల్గొన్నారు. డి.ఎస్.పి మాట్లాడుతూ “యువత ఎలాంటి చెడ్డ పనులు చేస్తున్నా ఒక్కసారి మీ తల్లిదండ్రులను, వారు మీకోసం పడే కష్టాన్ని గుర్తు చేసుకొండని, సోషల్ మీడియా లో వ్యక్తిగత ఫొటోస్ గానీ, సమాచారం గానీ అప్లోడ్ చేయొద్దని, పరిచయం లేని వాళ్లతో చాటింగ్ చేసి, పర్సనల్ గా కలవడానికి వెళ్లోద్దని, బెట్టింగ్ అప్స్ లో రిజిస్టార్ కావొద్దని, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మరొద్దని, సైబర్ నేరగాళ్ల మోసాలకు బలి కావొద్దని, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలే పరిష్కరం కాదని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి మంచిగా స్థిరపడాలని చెప్పారు. మిగిలిన పెద్దలు కూడా విద్యార్థులకు సూచనలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏ.ఎస్.డబ్ల్యు.ఏ విద్యార్థి సంఘ నాయకులు “పోలిశెట్టి గణేష్”ని అభినందించి ఇలాంటి విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని, మా పూర్తి సహకారం ఉంటుందని మహిళా పోలీసులు కొనియాడారు. రాజోలు శ్రీ చైతన్య కాలేజ్ సిబ్బంది, సుమారు 700 మంది విద్యార్థినీవిద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this content:
Post Comment