హరిరామ జోగయ్య అక్రమ అరెస్టును ఖండించిన దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు

విజయనగరం జిల్లా, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు రేగిడి లక్ష్మణరావు మరియు జనసేన విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పత్రికా ముఖంగా మాట్లాడుతూ హరిరామ జోగయ్య అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి. 80 ఏళ్ల వయసులో జోగయ్య చేస్తున్న పోరాటం చూసి 50 ఏళ్ల వయసున్న యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్యాంట్లు తడుపుకుంటున్నారని, ఈ బీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలని గత ప్రభుత్వంలోనే తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించారని కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి పదేపదే విషం చిమ్ముతున్నారు. వైయస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు, ఎమ్మెల్సీలు జోగయ్య ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే మీరు కాపు ద్రోహులే.