క్రీడాకారుల సౌకర్యార్దం గ్రౌండ్ ను శుభ్రం చేయించిన దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజవర్గం, 64వ వార్డు గంగవరం గ్రామం, బడి వారి వీధి, 7 స్టార్ స్పోర్ట్స్ యూత్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రౌండ్ మొత్తం చాలా కంచి తుప్పలు, చెత్త బాగా పెరిగిపోయిందని.. క్రీడాకారులకు, మరియు వాకింగ్ చేసే వ్యక్తులకు ఇబ్బంది అవుతుందని 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి కి విన్నవించుకున్నారు. ఈ సమస్యపై ఆయన స్పందిస్తూ తక్షణమే జివిఎంసి నుండి జెసిబి ని తెప్పించి గ్రౌండ్ శుభ్రం చేయించారు. ఈ సనదర్భంగా 7 స్టార్ స్పోర్ట్స్ యూత్ సభ్యులు గోవింద్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా నూకరాజు, దాసు, ఆది, మహేష్, దేవుడు, చిన్న, బాపూజీ, నవీను, నర్సింగ్ రావు, ప్రసాద్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికారి ప్రతినిధి చోడిపిల్లి ముసలయ్య చేశారు.