సిసి రోడ్ నిర్మాణ పనుల నాణ్యతను పర్యవేక్షించిన దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం: 64వ వార్డు కార్పొరేటర్, జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి వెంకన్నపాలెం గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులను దగ్గరుండి నాణ్యతను పరీక్షించి వేయించడం జరిగినది. ఈ విషయంపై అక్కడున్న గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ గోవింద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులి పెంటయ్య రెడ్డి, ధర్మాల అశోక్ రెడ్డి, జీవీఎంసీ అధికారులు మహిళలు పాల్గొన్నారు.