దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పోటీ చేయాలి: గాదె

గుంటూరు: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు లాడ్జి సెంటర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయవాడలో వైయస్సార్ పార్టీ నిర్వహించిన సభ ప్రభుత్వ సభ లేదా పార్టీ సభ అని ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వ సభ కాకుంటే విజయవాడలో పోలీసు వ్యవస్థను వాడుకొని అనేక చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా సభకు పెట్టిన ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే పోలీసు వారు కూడా ముఖ్యమంత్రి నిర్వహించిన సభకు ఎలాగైతే రక్షణ కల్పించారో అదేవిధంగా ప్రతిపక్షం నిర్వహించే సభలకు కూడా రక్షణ కల్పించాలని, రక్షణ కల్పించక పోయిన కనీసం ఆటంకాలు కల్పించకూడదని చెప్పి తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి గారు నాలుగు ప్రోగ్రామ్స్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నామని తెలియజేయడం జరిగింది. వాటి లో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఒకటని, ఈ పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్టిన వేళ విశేషం రెండు సంవత్సరాలు పాటు ప్రజలందరూ కుడా కరోనాతో బాధపడ్డారని, తర్వాత జగన్మోహన్రెడ్డి అమ్మిన మద్యం వల్ల ఎవరికి ఏ రోగం ఎందుకు వస్తుందో కూడా తెలియడం లేదని దుయ్యపట్టారు. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు ఉంటున్న గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను ప్రతిపక్షాల సమక్షంలో ఐదు నిమిషాల పాటు సందర్శించాలి అని చెప్పి అన్నారు. అలాగే జగనన్న విలేజ్ క్లినిక్ లు ఎక్కడ పనిచేయడం లేదని తెలియజేశారు. ఈ ఇంటింటికి తిరిగే ప్రోగ్రాం కేవలం ఓట్లు చేర్పు మరియు తీసివేయడం కోసమేనని ఎద్దేవ చేశారు. అలాగే రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలని మరో పథకంతో వస్తున్నారని అసలు రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరమో ప్రజల దగ్గర ఒక్క కారణం కూడా లేదని, అదే ప్రజల దగ్గర జగన్ ఎందుకు అవసరం లేదో లక్ష కారణాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు. అలానే సామాజిక బస్సు యాత్ర పేరుతో మరో పథకం పెట్టారని, అసలు సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం విశ్వసనీయత ఉన్న ఈ యాత్రకు పేరు మార్చాలని డిమాండ్ చేశారు. అలానే నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమంత్రి చెప్పుకునే నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ వర్గాల వారికి ఎన్ని పదవులు ఇచ్చారో తెలియజేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అలానే ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మరో పథకం పెట్టారని, ఆంధ్రాని ఆడుకుంటుంది చాలక, ఇప్పుడు పిల్లలతో ఆటలాడిస్తానని నాలుగున్నర సంవత్సరాల తర్వాత మరో విధంగా ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని, గత నాలుగున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్న ఒక్క స్టేడియం కూడా బాగు చేయడానికి ముందుకు రాని ఈ ప్రభుత్వం ఇప్పటికి ఇప్పుడు ఈ పథకం పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉందని తెలియజేశారు. అలాగే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ముఖ్యమంత్రికి కళ్ళు మూసుకుంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారని, అందుకని పాపం సరిగా నిద్ర కూడా పోవట్లేదని అన్నారు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ జనసేన పార్టీ పెట్టి 15 ఏళ్ల అయినా గాని వారికి అభ్యర్థులు లేరని విమర్శించారని దానికి సమాధానంగా ముఖ్యమంత్రిగారు దమ్ముంటే గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయని, మూడు నియోజకవర్గాలు రిజర్వేషన్ కింద పోయిన మిగిలిన 14 నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట ముఖ్యమంత్రి పోటీ చేయాలని, వారి మీద పోటీగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని, డబ్బు మద్యం పంచకుండా పోటీకి వెళ్దామని ఛాలెంజ్ చేశారు. అలాగే అస్తమానం పొత్తుల గురించి మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి కి, 2004 ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి గారి తండ్రిగారైన వైయస్సార్ పొత్తుల గురించి ఏం మాట్లాడారో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని చెప్పి హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇవన్నీ కూడా గమనించి వైయస్సార్ పార్టీని ఓడించి, జనసేన పార్టీకి పట్టం కట్టాలని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు బందనాదం జ్యోతి, గుంటూరు పట్టణ నాయకులు మధులాల్, తుళ్లూరు మండల అధ్యక్షుడు ఎర్ర గోపు నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.