జనసేన పార్టీ 12వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా అత్యంత అధ్బుతంగా కని, విని ఎరుగని రీతిలో జయకేతనం సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల నుండి వేలాదిగా సభకు తరలి రావడం చాలా సంతోషంగా ఉందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ గమ్యస్దానాలు చేరుకున్నారని అన్నారు. అధ్యక్షులు పవణ్ కళ్యాణ్ ప్రసంగాన్ని అందరూ విని రాత్రి 10 గంటల నుండి అందరూ తిరుగుపయనం అయ్యామని ఆమె తెలిపారు. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుండి నాయకులు కార్యకర్తలు లక్షలాదిమంది తరలి వచ్చారని దారం అనిత తెలిపారు.
Share this content:
Post Comment