అన్నమయ్య జిల్లాను రాష్ట్ర రోడ్డు రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత కితాబునిచ్చారు. బుధవారం మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు టిడిపి నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా షో ఆప్ శీనా మండపల్లి సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందంటే అది మండిపల్లె కుటుంబం గొప్పతనమన్నారు.మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో అయనకు మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేశారు. రాయచోటి నియోజకవర్గమే కాకుండా, జిల్లా ప్రజలతో మండిపల్లి కుటుంబానిది విడదీయరాని అనుబంధమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల శ్రేయస్సు కోసం మంత్రి మండిపల్లి నిరంతరం పరితపిస్తుంటారని కొనియాడారు.మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించారన్నారు. రామాయణంలో రాముడికి లక్ష్మణుడు సహాయ,సహకారాలు అందించాడని, అదే తరహాలోనే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఆయన సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి రాజకీయాల్లో అండగా నిలుస్తున్నాడని వివరించారు. ఆ భగవంతుడు ఆశీస్సులతో మండిపల్లి సోదరులు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
Share this content:
Post Comment