దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని… జగన్‌కు చంద్రబాబు సవాల్

సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ…ఎన్నికల ముందు అమరావతే రాష్ట్ర రాజధాని అని, దానికే తమ పూర్తి మద్దతని పలుమార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి… ఎన్నికలు కాగానే నయ వంచనకు పూనుకున్నారు. ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని మార్చే హక్కు మీకు లేదు. మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరండి ప్రజలు రాజధాని విషయంలో మీ వాదనకు మద్దతు ఇస్తే మేం ఇక మాట్లాడం. దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని, మీకు ఆ దమ్ము ఉందో లేదో తేల్చుకోండి  అని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. పైగా దానికే తమ పూర్తి మద్దతని పలుమార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.