పోలవరం నియోజకవర్గంలోగుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

పోలవరం: కొయ్యలగూడెం మండలం, బయ్యన్నగూడెం గ్రామంలో సరిపల్లికి వెళ్ళు రహదారి అస్తవ్యస్తంగా ఉన్నది. నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తమకు రోడ్డు ఇస్తానని చెప్పి మోసం చేశాడని, నేడు జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రి బాలరాజు, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొరగం శ్రీనివాసులు అధిష్టానం ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ కు దారి ఎటు కార్యక్రమం మండల అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లినరేష్, టౌన్ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే తీరుని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా రోడ్స్ వేసే భాద్యత తీసుకుంటామని మాట ఇచ్చారు. ఖబద్దార్ తెల్లం బాలరాజు అంటూ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సతీష్, ప్రగడ రమేష్, మద్దు తేజ, మేకల తేజ, శ్రీనివాస్ నాయుడు, సంకు మధుదాకారపు మధు, తాడేపల్లి గోపి వొర్రింకలా సత్తిబాబు, కంకిపాటి వంశీ, మెట్ట బుచ్చి రాజు, కొయ్యలగూడెం మండల కమిటీ, గ్రామ కమిటీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.