అనంతపురం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

అనంతపురం నియోజకవర్గం: గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా.. అనంతపురం నియోజకవర్గం, నారాయణపురం ప్రధాన కూడలి నందు రోడ్డు, క్లాక్ టవర్ బ్రిడ్జి ప్రక్కన కోర్టు రోడ్డుకు పోయే సర్వీస్ రోడ్డు దుస్థితి, శాంతినగర్ ప్రధాన రహదారి, పివికె కాలేజీకి పోయే దారి దుస్థితి. రుద్రంపేట బైపాస్ రోడ్డు నుండి చంద్రబాబు నాయుడు కొట్టాల కాలనీకి పోయే దారి దుస్థితిని అనంతపురం నియోజకవర్గపు ప్రజలారా ఒక మారు గమనించాలని, జగనన్న ఇంకెప్పుడు ఈ రోడ్డుకు మరమ్మత్తు చేస్తారు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి అంటే ఇదేనా? అంటూ జనసేన-టిడిపి నాయకులు శనివారం నిరసన తెలిపారు.