నటుడిగా దర్శకేంద్రుడి అరంగేట్రం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలిసారి తెరముందుకు రాబోతున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన ఈ సీనియర్‌ డైరెక్టర్‌ ఇప్పుడు మరో అవతారం ఎత్తనున్నారట. 78 ఏళ్ల వయసులో నటుడిగా అరంగేట్రం చేయనున్నారనీ  సినీ వర్గాల్లో వినిపిస్తోన్నసమాచారం. నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఓ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారట. ఇందులో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో నటిస్తారని, అలాతే రమ్యకృష్ణ, సమంత, శ్రియ నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సామాజిక ఇతివృత్తానికి సందేశాన్ని మేళవిస్తూ రచయిత జనార్ధన మహర్షి రాసిన కథ నచ్చడంతో రాఘవేంద్రరావు ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రయోగాత్మక కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మరి నిజానిజాలేంటో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.