గాంధీ జయంతి వేడుకలలో దర్శి జనసేన

దర్శి: జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలలో నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా వారిని కూడా స్మరించుకొని నివాళులనర్పించారు. వారిద్దరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకొని, వారి ఆశయసాధనకు కృషి చేద్దామని అన్నారు. తరువాత జనసేన పార్టీ శ్రేణులతో కలిసి మాజీశాసన సభ్యులు నారపుశెట్టి పాపారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమములలో జనసేన పార్టీ ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పుప్పాల రుద్రా, నియోజకవర్గ ఐ టి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు, ముండ్లమూరు మండల కమిటీ ఉపాధ్యక్షులు అంచుల వీరాంజనేయులు, దొనకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు షేక్ షఫీయుల్లాఖాన్, కురిచేడు మండల కమిటీ ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, దర్శి మండల కమిటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి గుండ్ల భారతి, దర్శి మండల ఉపాధ్యక్షులు కాట్రాజు వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ వెంకటేష్, జనసేన పార్టీ దర్శి మండల నాయకులు జడల వెంకట్, జనసైనికులు తోట రాయుడు, ఉబ్బరపు వెంకటేశ్వర్లు యాదవ్, లాగ ఆంజనేయ యాదవ్, పిచ్చాల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు పట్టణ కమిటీ అధికార ప్రతినిధి పాపిశెట్టి రవి వెంకట రామాంజనేయులు, మరియు పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పుప్పాల పుప్పారావు ప్రసంగించారు.