పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన దాసరి రాజు

ఇచ్చాపురం మున్సిపాలిటీ వార్డులలో నెలకొని ఉన్న పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జి దాసరి రాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఇచ్చాపురం మున్సిపాలిటీ 23 వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ బాలేదు వాటిని శుభ్రపరచి, శానిటైజేషన్ చేయాలి. అలానే 23 వ వార్డులలో కుళాయిలు ద్వారా సప్లై అవుతున్న బురద నీటిని మంచి నీరుగా ఫిల్టరైజేషన్ చేసి ప్రజలకి అందించాలని కోరుతున్నాం. రానున్న కాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రతీ వీధిలో కాలువల దగ్గర సానిటైజేషన్ జరగాలి మరియు కుళాయి నీరు ఫిల్టరైజేషన్ చేసి ప్రజలకు సప్లై చేయాలి లేని యెడల జనసేన పార్టీ తరపున గళం ఎత్తడం జరుగుతుంది. మరియు
పదో వార్డు ఖర్జివిది పొకలవిది మధ్యగల చెత్త కుండీ వలన.. పందులతొ అక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నామని జనసేన ఇన్చార్జి రోకలి భాస్కర్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వెంటనే తొలగించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ జరిగినది.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వార్డ్ ఇన్చార్జిలు 9,10,11,20,22, దాసరి శేఖర్, సంతోష్ మహారాణా, రోకళ్ల భాస్కర రావు, సంతోష్ బిసాయి, కలియ గౌడ, మరియు జనసైనికులు సింహాచలం, పురుషోత్తం, ఉస్మాన్, ఫరీద్, కామేష్, మురళి, గణేష్, నాగమణి, రాము, చందు, శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.