కవిటి ఎంపీడీవోకి జనసేన నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన దాసరి రాజు

కవిటి మండలంలోని దుగాన పుట్టుగ పంచాయతీలో సిబ్బందిని నియమించాలని, అలాగే దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ కవిటిలో ఎంపీడీవో కి ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు జనసేన నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. బెజ్జిపుట్టుగ పంచాయతీలో ఉన్న దూగాన పుట్టుగ ఆ గ్రామ ప్రజల కోరిక మేరకు దూగాన పుట్టుగ పంచాయితీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదని, పారిశుధ్యం లోపించడం వల్ల దోమలు బెడద ఎక్కువగా ఉంది అని దీని వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్య వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10 వ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, హేమా చలపతి, రాజశేఖర్, తలగానా ఈశ్వర్, జోగారావు, రామకృష్ణ, ప్రవీణ్ బెహరా, గిరి బెహరా, నవీన్, ధనుంజయం గార్లు తదితరులు పాల్గొన్నారు.