బెంతో ఒరియాల నిరసన దీక్షకు దాసరి రాజు మద్దతు

  • బెంతో ఒరియాలు చేపట్టిన ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జి దాసరి రాజు

కవిటి: బెంతో ఒరియా కులస్థులకు జరుగుతున్న అన్యాయాలపై బెంతో ఒరియా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలో ఇచ్ఛాపురంనియోజకవర్గ జనసేన ఇంఛార్జి దాసరి రాజు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అలాగే కవిటి బస్ స్టాండు వద్ద గత 5 రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలో కూడా పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న బెంతో ఒరియా లకు ఎస్ టి కుల దృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వలన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని, విద్యార్థుల ఉన్నత చదువులుకు, ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో అందరూ ఉన్నా కూడా వారికి జరుగుతున్న అన్యాయం వల్ల ఆ వేడుకను బహిష్కరించి, ఈ రోజు రోడ్డు ఎక్కి హక్కులకోసం పోరాటం చేస్తున్న బెంతో ఒరియాలకు అండగా ఉంటామని, ఈ సమస్యపై జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు కొంతమంది కుల పెద్దల సమక్షంలో ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది అని, అతను పలుమార్లు బహిరంగ సభల్లో బెంతో ఒరియా కులస్థులు ఇబ్బందుల కోసం ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న కాలంలో మీరు శాంతియుత ధర్నాలు, ఉద్యమాలు చేసినా జనసేనపార్టీ తరపున పూర్తి మద్దతు తెలిపి అండగా ఉంటామని తెలిపారు. ర్యాలీ సందర్భంగా వచ్చి మద్దతు తెలిపి, రిలే దీక్షలో పాల్గొన్నందుకు బెంతో ఒరియా కుల ప్రతినిధి శ్రీ సుమన్, కుల పెద్దలు దాసరి రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10వ వార్డ్ ఇంఛార్జి రోకళ్ల భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ కుమార్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూగాన దివాకర్, బడే రాజు, తలగాన ఈశ్వర్, సంజు రౌలో, బొగిడియ రాజశేఖర్, లోళ్ళ సాగర్, జోగారావు, ప్రవీణ్, లోళ్ళ ధనుంజయం, డి.రాజు, సతీష్, భాస్కర్, దశరథ, వాసు, పరశురాం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.