డెంగ్యూ బాధితులను పరమర్శించిన దాసరి రాజు

ఇచ్చాపురం, కవిటి మండలం, కపాసుకొద్ది గ్రామం మొత్తం సుమారు 90 శాతం మందికి డెంగ్యూ వ్యాధి పట్టిపీడిస్తుంది అని గ్రామ జనసైనికులు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజుకి తెలియజేయడంతో వాళ్ళని పరామర్శించి, వాళ్ళ యోగ క్షేమాలను తెలుసుకొని, వాళ్ళ పేద పరిస్థితులు తెలుసుకొని, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది అని తెలుసుకొని ఇప్పటికి ఈ గ్రామంలో డెంగ్యూ వ్యాధితో 9 ఏళ్ల పాప, 28 ఏళ్ల గృహిణి మరణించడం గ్రామస్తులు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. తక్షణమే కొద్ది రోజులు హెల్త్ డిపార్ట్మెంట్ దృష్టిసారించి మెడికల్ క్యాంపులు పెట్టాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కపాసుకొద్ది గ్రామస్తులు, బడే రాజు, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి సురేష్ కుమార్, కల్యాగౌడో, జనసేన సోషల్ మీడియా బడగల రామకృష్ణ, అజయ్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.