వలసల_వర్కర్స్ ఓటు హక్కు పరిరక్షణపై దాసరి రాజు వినతి

ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ ఆఫీసర్ శ్రీమతి పద్మావతి అధ్యక్షతన నిర్వహించబడిన బి.ఎల్.ఓల మీటింగ్‌లో, జనసేన పార్టీ ఇచ్చాపురం ఇంచార్జ్ మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు పలు కీలక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా వలసల‌కు వెళ్లే మత్స్యకార సోదరులు మరియు విదేశాల్లో పని చేస్తున్న కార్మిక సోదరులు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్న పరిస్థితిని ప్రస్తావించారు. వీరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదనీ, వలసలో ఉన్నవారి హక్కులు రక్షించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని దాసరి రాజు పేర్కొన్నారు.

Share this content:

Post Comment