దత్తిరాజేరు మండల జనసేన ఆత్మీయ సమావేశం

గజపతినగరం నియోజకవర్గం: దత్తి రాజేరు మండల జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించడం జరిగినది. ఈ సందేభంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. బి.ఎల్.ఓ ఓటరు జాబితా కోసం ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు యొక్క వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జులై 21వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకూ జరుగుతుంది. ఈ అంశం బట్టి ప్రతి గ్రామంలో బి.ఎల్.ఓ బూత్ ఎజెంట్లను నియమించాలని మరియు బి.ఎల్.ఓ గా గవర్నమెంట్ సభ్యులు తప్ప గ్రామ వాలంటీర్ కి ఎటువంటి సంబంధం లేదని కోరడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కచ్చితంగా జనసైనికులు అరాతీయాలని కోరడమైనది మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని జగన్ మోహన్ రెడ్డి గారు మూడు పెళ్లిళ్లు, అక్రమ సంబందాలు అంటూ విమర్శలు చేసారు. వైసీపీ ముఖ్య మంత్రికి మేము 1.18 లక్షల కోట్లు లెక్క ఆడితే చెప్పరు. కనీసం ప్రెస్ మీట్ పెట్టరు. ఈ లాంటి పాలన వలన ప్రజలు చాలా ఇబ్బందాలు పడుతున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్య నిర్యాహన కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్, దత్తి రాజేరు మండలం అధ్యక్షులు చప్పా అప్పారావు, గజపతినగరం అధ్యక్షులు మునకాల జగన్, మండలం నాయకులు ఉపాధ్యక్షులు మార్పిని అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శిలు ఎన్. చరణ్, ఎస్. ప్రవీణ్, పి. సత్యనారాయణ, ఎం. దుర్గా రావు, రామచంద్రరావు, వేణు, కృష్ణ మూర్తి, జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.